నెరవేరనున్న జమ్మూకశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం!
వైష్ణోదేవి ఆలయ పర్వత పాదాల కింద 3.2 కిలోమీటర్ల పొడవైన T-133సొరంగంలో నూతన రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తయింది.
ఉధంపుర్- శ్రీనగర్-బారాముల్లా రైల్వేలైను (USBRL)లో ఇదే చిట్టచివరి ట్రాక్. దీనివల్ల ఇకపై దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ మీదుగా నేరుగా కశ్మీర్ కు చేరడం వీలవుతుంది. జనవరి 26న వందేభారత్ రైలు దీనిపై పరుగులు తీస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా కశ్మీర్ కు చేరే తొలి రైలు అదే అవుతుంది.