ముందుచూపు, దూరదృష్టితో ప్రజలకోసం పనిచేసే నాయకుడు దొరకడం రాష్ట్రానికి వరం : మాజీ మంత్రి పుల్లారావు.
నాదెండ్ల మండలం తూబాడు, సాతులూరు గ్రామాల్లో ప్రభుత్వం రూ. 10 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్లను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుతో కలిసి ప్రారంభించిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయ పెంపు మార్గాలపై రైతులు దృష్టి పెట్టాలి – గేదెలు, మేకలు, కోళ్ల పెంపకం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది – పుల్లారావు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీ రుణాలు. పథకాలను రైతులు, యువత, మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.- పుల్లారావు.
సంపద సృష్టి విధానంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, ముందుచూపుతో పనిచేస్తున్నారని, నిత్యం ప్రజలకోసం ఆలోచించే అటువంటి వ్యక్తి రాష్ట్రానికి నాయకుడు కావడం నిజంగా ఏపీకి వరమని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.
శుక్రవారం నాదెండ్ల మండలం సాతులూరు, తూబాడు గ్రామాల్లో కూటమి ప్రభుత్వం రూ.10లక్షల వ్యయంతో రైతులకోసం నిర్మించిన గోకులం షెడ్లను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుతో కలిసి మాజీ మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాజాగా ప్రారంభించిన గోకులం షెడ్లు కోళ్ల పెంపకం కోసం నిర్మించడం జరిగిందని, స్థానిక రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయంలో వినూత్న విధానాలు అవలంభించాలని, నానాటికీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సాగు చేపట్టాలని, తద్వారా అన్నదాతల ఆదాయం పెరుగుతుందన్నారు. కేవలం భూమినే నమ్ముకోకుండా, గేదెలు.. మేకలు.. కోళ్ల పెంపకం లాంటివి చేపట్టాలని, వాటికోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు ఇస్తోందన్నారు. ఇటువంటి వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా రైతులు అదనపు ఆదాయార్జన దిశగా ఆలోచించాలని పుల్లారావు సూచించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణలో కూడా అవినీతికి పాల్పడిందని, కూటమి ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరిపి, రైతులకు సకాలంలో డబ్బు చెల్లించిందన్నారు.
ప్రతి కుటుంబం ఆదాయం పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, ముందుచూపు.. దూరదృష్టి ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి నాయకుడు కావడం నిజంగా ప్రజలకు వరమని మాజీ మంత్రి చెప్పారు. కేంద్రప్రభుత్వం ఎం.ఎస్.ఎమ్.ఈ (M.S.M.E) లో భాగంగా 12 పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిలో భాగంగా కనిష్ఠంగా రూ.10లక్షల నుంచి, గరిష్ఠంగా రూ.5 కోట్లవరకు సెక్యూరిటీలేని రుణాలు అందిస్తోందన్నారు. అటువంటి వాటిని సద్వినియోగం చేసుకుంటే గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, రైతులు ఆర్థికంగా స్థిరపడతారని మాజీమంత్రి సూచించారు.
జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ…
దాదాపు రూ.10లక్షల ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులతో నిర్మించిన గోకులం షెడ్లను శాసనసభ్యులు పుల్లారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు ఈ షెడ్లను సద్వినియోగం చేసుకొని, అదనంగా ఆదాయం పొందాలన్నదే ప్రభుత్వ సదుద్దేశమని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు ద్వామ పీడి యం.సిద్దలింగమూర్తి, జనసేన కన్వీనర్ తోట రాజా రమేష్, నియోజకవర్గ సమన్వయకర్త సదాశివరావు , మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, నాదెండ్ల మండలం MRO వెంకట రమణ , నాదెండ్ల మండలం MPDO స్వరూపరాణి , నాదెండ్ల MPP తలతోటి రాణి పలువురు పాల్గొన్నారు.