SAKSHITHA NEWS

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకరరావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేఖ రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తికి సీబీఐ అనుమతి ఇచ్చింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకరరావు, శ్రావణ్‌రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకరరావు, శ్రావణ్‌రావులు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు, మీడియా ప్రతినిధి శ్రావణ్‌రావులకు ఇంటర్ పోల్ నోటీసులు జారీ కానున్నాయి. ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులు గత కొద్ది రోజులుగా సీబీఐ అధికారులకు కేసు దర్యాప్తు మొత్తం వివరించారు. అయితే ప్రభాకరరావు, శ్రావణ్‌రావులు విచారణకు హాజరైతేనే కేసు పురోగతి ఉంటుందని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి లబ్ది చేసేందుకే ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసి పెద్ద మొత్తంలో లబ్ది పొందారు. ఈ కేసులో చాలా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ అధికారులకు పూర్తి నివేదికలు అందించారు. ఈ నిదేదికలు తీసుకున్న సీబీఐ అధికారులు అమెరికాలో ఉన్న ప్రభాకరరావు, శ్రావణ్‌రావులను ఇంటర్ పోల్ సహాయం కోరారు


SAKSHITHA NEWS