![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-19.06.08.jpeg)
బంగారు బాల్యంతో మహోన్నత ప్రపంచం సాధ్యం
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి
బంగారు బాల్యం పై అవగాహన కల్పించిన కలెక్టర్ తమీమ్ అన్సారియ
కనిగిరి సాక్షిత
కనిగిరి నియోజకవర్గం కనిగిరి పట్టణంలోని షాదీ ఖానా లో బంగారు బాల్యం పై ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలను నివారించి సాధికారత దిశగా బాలికలను ఎదగనిద్దాం అందుకే ప్రభుత్వం బంగారు బాల్యం కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని రూపకల్పన చేశామన్నారు. బాలల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామాల్లోని బడి బయట పిల్లలను గుర్తించి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని, వారిని ఓపెన్ పాఠశాలలో చేర్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ బాల కార్మికులు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, బాలికలపై లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పసి పిల్లల నవ్వులే దేశానికి వెలుగులని, వారి చదువులే నూతన బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని, బంగారు బాల్యం తోనే మహోన్నత ప్రపంచం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్,ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి, డి.ఎస్.పి సాయి ఈశ్వర్ యశ్వంత్, డి ఎల్ డి ఓ శ్రీనివాసులు రెడ్డి, ఎంపీడీవోలు, ఎం ఈ ఓ లు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-19.06.08-1024x500.jpeg)
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app