భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన మహోన్నత మూర్తి, యువతకు ఆదర్శనీయులు స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఆద్యాత్మిక ఆదర్శాలతో మాతృదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన “వివేకానందుడి” స్పూర్తి తో నేటి యువత నడయాడలని ఆకాంక్ష లతో భారతీయులందరికి ప్రపంచ “యువజన దినోత్సవ” శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. మందలో ఒకరిగా ఉండకు…వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు…లేవండి..మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి అంటూ.. ఇలా ఒకటేంటి ఎన్నో ప్రసంగాలతో.. మరెన్నో సందేశాలతో యువతను ఆకట్టుకున్న యోగి వివేకానంద అని. భారతదేశ ఖ్యాతిని, మన దేశ సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన ఏకైక వ్యక్తి స్వామి వివేకానంద అని భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.భారతీయ ఆధ్యాత్మికతను పునరుజ్జీవింపచేయడంలో, యువశక్తిని చైతన్యపరచడంలో వివేకానందుడి కృషి అమూల్యం, అనితరసాధ్యం. అని ఆయన సూక్తులు నిత్యం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాయి అని భవిష్యత్తులోనూ నింపుతాయి అని, ఆయన జయంతిని పురస్కరించుకుని జాతీయ యువదినోత్సవం గా జరుపుకుంటామని ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
