మహిళల భాగస్వామ్యంతోనే మెరుగైన సమాజం…………. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజిని.
మహిళల భాగస్వామ్యం తోనే మెరుగైన సమాజాలను నిర్మించవచ్చని
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి రజిని పేర్కొన్నారు
అంతర్జాతీయ మహిళల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి మండలం లో నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచులకు, వార్డు మెంబర్లకు ,మహిళా సంఘం సభ్యులకు చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ సర్పంచులు మరియు వార్డు మెంబర్లు వారి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాలను బాల్య వివాహ రహిత గ్రామాలుగా అలాగే బాల కార్మికులు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదేవిధంగా గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, గర్భాధారణకు ముందు ప్రసవానికి ముందు లింగ నిర్ధారణను నిరోధించే చట్టం మరియు పోష్ ఆక్ట్ గురించి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు మరియు ఎంపీ.డీ.వో రవీంద్రబాబు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
