SAKSHITHA NEWS

రవీంద్రభారతిలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు
స్థానిక కురమ్మన్నపాలెం రవీంద్రభారతి పాఠశాలలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఏసుక్రీస్తు పుట్టిన రోజునే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుని, ఎంతో పవిత్రంగా భావిస్తారని,జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడుగానూ, దయామయుడుగానూ ప్రపంచంలోని క్రెస్తవులతో ఆరాధనలను అందుకుంటున్నాడని,మనము వెన్నవంటి మనసు,తేనె వంటి పలుకు,వెన్నెల వంటి చూపు జీసస్ నుండి నేర్చుకోవాలని,అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు మరియు చిన్నారులకు నా ఆశీస్సులు అని రవీంద్రభారతి పాఠశాలల చైర్మన్ యం.యెస్.మణి తెలియజేశారు.వేల ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ పాలించే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి ‘ఓ మేరీ! నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావు..

అంతే కాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు’ అని తెలియజేసింది. ఏసు అంటే రక్షకుడు అని అర్థం అని నార్త్ ఆంధ్రా జోనల్ ఇన్చార్జ్ యన్.వెంకటేష్ అన్నారు.ఆకాశం నుంచి ఒక దేవదూత దిగి వచ్చి ఈ రోజు బెత్లెహోమ్‌లోని ఓ పశువుల పాకలో లోక రక్షకుడు పుట్టాడు, ఆయనే మీ అందరికీ ప్రభువు… మరియు మన జీవితాలలో జరిగే అన్నిటినుండి మంచిని తీసుకుని రావడానికి దేవుడు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాడని సీ.జీ.యం జీ.ఆర్.వసంత అన్నారు.ఒక పసికందు గుడ్డల్లో చుట్టి, పశువుల తొట్టిలో అమ్మ పొత్తిల్లలో పడుకుని ఉంటాడని, ఇవే మీకు ఆనవాళ్లని, అతడే లోకరక్షకుడు’ అని చెప్పాడు. గొర్రెల కాపర్లతో ఈ విషయం గురించి చెబుతుండగానే ఆ ప్రాంతమంతా ఆకాశం నుంచి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది అని పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ జయశ్రీ అన్నారు.కార్యక్రమములో డీన్ రమ్య గారు , teachers and చిన్నారులు పాల్గొన్నారు.చిన్నారులు ధరించిన శాంతా క్లాజ్,మేరీ,జోసెఫ్ వేషధారణలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.


SAKSHITHA NEWS