SAKSHITHA NEWS

సమస్యల వలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల
కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘ నాయకు లు రవి యాదవ్
*
సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారన్న విషయాన్ని కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ విద్యా పరిషత్ జిల్లా అధ్యక్షు లు రవియాదవ్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల
జిల్లా కేంద్రం లోనే ఉన్నప్పటికీ సరియైన అధ్యాపకులు లేక కనీసం శుభ్రం చేయడానికి స్వీపర్స్, స్కావెంజర్స్ లేక దుర్గందపూరితమైన వాతావరణంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా కలెక్టర్ కు వివరించగా కలెక్టర్ సానుకూలంగా స్పదించినట్లు టిజివిపి జిల్లా అధ్యక్షుడు రవియాదవ్ తెలిపారు.


SAKSHITHA NEWS