ATM కామారెడ్డి జిల్లా :
ఏటీఎంలోకి చొరబడ్డ దుండగులు.. ఏకంగా ఏటీఎం మిషిన్‌ను ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో రాత్రి చోటుచేసుకుంది.
ఏటీఎంలో రూ. 3.95 లక్షల నగదు ఉన్నట్టు సమాచా రం. ఘటనా స్థలాన్ని బాన్సువాడ డీఎస్పీ సత్యనా రాయణ, సీఐ నరేష్ పరిశీలించారు. మూడు గంటల ప్రాంతంలో వచ్చిన దుండుగులు.. కేవలం మూడు నిమిషా ల్లోనే ఏటీఎంను ఎత్తుకెళ్లి నట్టు సమాచారం.
ఎస్‌ఐ మోమన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారు జామున 3 గంటలా 20 నిమిషాల సమయంలో దొంగలు చాకచక్యంగా ఏటీఎంలోకి చొరబడి డబ్బులతో సహా ఏటీఎం మెషిన్‌ను ఎత్తుకెళ్లారు.
ఏటీఎంలో రూ. 3 లక్షలా 95 వేలు ఉన్నాయని, ఏటీఎంతో సహా దొంగలు ఎత్తుకెళ్లినట్టు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మోహన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ప్రధాన కూడలిలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించగా..ఏటీఎం ఎత్తుకెళ్లిన దొంగలు మహారాష్ట్ర వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.
త్వరలోనే దుండగులను పట్టుకుంటామని తెలిపారు. ఏటీ ఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన ఘటనలు చూశాం కానీ.. ఏకంగా మిషిన్‌ను ఎత్తుకెళ్లిన ఘటన ఇంతవరకు చూడలేదని స్థానికులు పేర్కొంటున్నారు…