SAKSHITHA NEWS

అధికారులు సిబ్బంది సమన్వయంతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి చేయాలని ఆదేశించిన…………. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
షాపింగ్ మాల్స్ కు పార్కింగ్ తప్పనిసరి
*
సాక్షిత వనపర్తి :
అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుంటూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

     జిల్లా కేంద్రంలోని 31వ వార్డ్ కేడీఆర్ నగర్ లో పర్యటించిన కలెక్టర్, ఎన్యుమరేటర్లు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. 

   ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్రమైన వివరాలతో ఎలాంటి తప్పులు లేకుండా సర్వేను చేయాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. స్టిక్కర్లు, ఇళ్ల జాబితాలో నంబర్లు సరిగా వేయాలని చెప్పారు. అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుంటూ సర్వే ప్రక్రియను కొనసాగించాలన్నారు. ప్రజలు కూడా సర్వే కోసం వచ్చే సిబ్బందికి సహకరించాలని చెప్పారు. 

షాపింగ్ మాల్స్ కు పార్కింగ్ తప్పనిసరి
జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ దిశగా మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మునిసిపల్ ట్రేడ్ లైసెన్స్ లు కూడా తనిఖీ చేయాలని లేని పక్షంలో నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు.

  తహసీల్దార్ రమేష్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ పూర్ణ చందర్, మునిసిపల్ ఛైర్మన్ పుట్టపాకుల మహేష్, ఎన్యుమరేటర్లు, సర్వే సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

SAKSHITHA NEWS