మంద కృష్ణ మాదిగ – RS ప్రవీణ్ కుమార్ కలయిక.
హైదరాబాద్ లో MRPS అధినేత మంద కృష్ణ మాదిగ మరియు BSP మాజీ అధ్యక్షులు, ప్రసుత BRS నేత,IPS అధికారి డా.R S ప్రవీణ్ కుమార్ సమావేశమయ్యారు.
మూడు దశాబ్దాలుగా సాగిన MRPS ఉద్యమం సుప్రీం కోర్టు తీర్పు ద్వారా అనేక అడ్డంకులను దాటుకొని విజయాన్ని సాధించుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకొచ్చుకోవడానికై మాదిగ నేతలను, మేధావులను, ఉన్నత అధికారులను ఐక్యం చేయడంలో భాగంగా MRPS అధినేత మంద కృష్ణ మాదిగ RS ప్రవీణ్ కుమార్ తో సమావేశం కావడం జరిగింది.
మాదిగ జాతి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తన వంతు పాత్రను నిర్వహించాలని మంద కృష్ణ మాదిగ ప్రవీణ్ కుమార్ కి తెలియజేశారు.
ఎస్సీ వర్గీకరణ డిమాండ్ న్యాయమైనదని , సామాజిక న్యాయం అన్ని కులాలకు దక్కడం కోసం వర్గీకరణ అమలులోకి రావాలని అందుకు తన వంతు పాత్రను నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రకాష్ ,మిట్టపల్లి సురేందర్, దరువు ఎల్లన్న, నలిగంటి శరత్, పాటమ్మ రాంబాబు, ముప్పురి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)