
విజయవాడలో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం
విజయవాడ నడిబొడ్డున ఏడాది క్రితం ప్రారంభించిన 206 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ నిర్వహణ భారంగా మారడంతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. సామాజిక న్యాయ శిల్పం పేరిట వైసీపీ హయంలో రూ.400కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. గత ఏడాది జనవరిలో విగ్రహావిష్కరణ చేయగా ఈ ఏడాది అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు.
అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రతిపాదనల్ని గత డిసెంబర్‌లోనే వెలుగులోకి వచ్చింది.
ప్రతి నెల రూ.21లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుండటంతో విగ్రహ నిర్వహణ భారాన్ని వదిలించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనిని అప్పట్లో జిల్లా యంత్రాంగం ఖండించింది.
