SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 11 at 3.12.35 PM

సాక్షిత ; పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్ లో ఉన్న అన్ని ఫైల్స్ వెంటనే పరిష్కరించి అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చూడాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఫైల్స్, మాస్టర్ ప్లాన్ రోడ్ల లో టి.డి.ఆర్. బాండ్ల పంపిణీ తదితర అంశాలపై నగరపాలక సంస్థ లో తన చాంబర్లో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి కొన్ని చోట్ల టి.డి.ఆర్. బాండ్లు ఎందుకు ఇవ్వలేదని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి ఇచ్చిన వారు ఇంకా రిజిస్ట్రేషన్ చేయకపోవడం వలన ఆలస్యం అయ్యిందని అధికారులు తెలుపగా, మీరు వారి ఒకటికి రెండుసార్లు ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడి వారికి పెండింగ్ లేకుండా టి.డి.ఆర్. బాండ్లు అందేలా చూడాలన్నారు. అలాగే ఎటువంటి ఫైల్స్ కూడా పెండింగ్ ఉండరాదని, ఏవైనా ఉంటే వెంటేనే నా దగ్గరకు తీస్తే పరిష్కరిస్తానని అన్నారు.

పట్టణ ప్రణాళిక విభాగం లో ఫైల్ పెండింగ్ ఉందని ఎవ నా వద్దకు వస్తే సంబంధిత అధికారులపై కటిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పెండింగ్ లో ప్రకటనల బిల్లులు తదితరాలను వెంటనే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ సునీత, డి.సి.పీ. శ్రీనివాసులు రెడ్డి, ఏ.సి.పీ. బాల సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్లు హసీం, నరేంద్ర, రాజశేఖర్, సర్వేయర్ దేవానంద్, ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS