SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 19 at 12.37.47 PM

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ మీడియా సాక్షిగా ఆరోపణలు చేశారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో కేసు దాఖలు చేసిన కేసులో తీర్పు వెలువడింది.
ఈ మేరకు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయి సుధ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు. ఈ పరువు నష్టం కేసులో దంపతులకు జైలుశిక్ష ఖరారైంది. జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు.. జైలు శిక్ష తో పాటు 5 వేల రూపాయల జరిమానా కూడా విధించింది.


SAKSHITHA NEWS