సాక్షితతిరుపతి : జగనన్న ఇంటి నిర్మాణాల్లో పురోగతి సాధించి, జగనన్న ఇళ్ళను గృహ ప్రవేశాలకు సిద్దం చేయాలని హౌసింగ్, ఇంజనీరింగ్ అధికారులకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మునిసిపల్ ఇంజనీర్లు, హౌసింగ్ అధికారులతో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ సమావేశం నిర్వహించారు. జగనన్న ఇంటి నిర్మాణాలపై వారం వారం సమిక్షలు నిర్వహించడం, అధికారులు పనులను వేగవంతం చేస్తామని చెప్పడం చేస్తున్నారే గాని, చెప్పినంతలో పనులు ముందుకెల్లడం లేదని కమిషనర్ హరిత ఐఏఎస్ అసహనం వ్యక్తం చేసారు.
జూలై నెలలో గృహ ప్రవేశాలకు జగనన్న ఇళ్ళ నిర్మాణాలను అనుకున్న మేరకు సిద్దం చేయాలని స్పష్టంగా చెప్పినా కూడా ఇంత వరకు అనుకున్న మేరకు లక్ష్యలను పూర్తి చేయకపోవడం తగదన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిందేపల్లి, జీపాళెం, కల్లూరు, ఎం.కొత్తపల్లి, సూరప్పకశం, టిసి.అగ్రహారం ప్రాంతాల్లో నిర్మిస్తున్న జగనన్న ఇంటి నిర్మాణ లే అవుట్లలో నిర్మాణల వారిగా ఏఏ దశల్లో వున్నాయో చర్చిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న జగన్న నిర్మాణాలను వేగవంతం చేసి జూలై 17 కల్లా తమకిచ్చిన లక్ష్యాల మేరకు ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేయవల్సిందేనని కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేసారు.
ప్రతి లే అవుట్లలో నీటి కొరత లేకుండా చూడాలని, ఇంకా బోర్లు అవసరమైతే వెంటనే బోర్లను వేయించాలన్నారు. సిమెంట్, ఇటుకలు, ఐరన్ కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని కమిషనర్ హరిత స్పష్టం చేసారు. హౌసింగ్, ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లను సమన్వయం చేసుకొంటూ లే అవుట్లపై నిరంతరం పర్యవేక్షణ సాగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. ఈ సమావేశంలో ముని సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, హౌసింగ్ పి.డి వెంకటేశ్వర్లు, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, డిఈలు సంజీవ్ కుమార్, రవీంధ్రరెడ్డి, దేవిక, గోమతి, మహేష్, హౌసింగ్ డిఈ శ్రీనివాసులు, కాటంరాజు అమెనిటి సెక్రటీర్లు పాల్గొన్నారు.*