SAKSHITHA NEWS

ఎం ఎం బి మెడిషైన్ మల్టీ స్పెషా లిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ…

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా ప్రభుత్వ హాస్పటల్లో మరియు ట్రాఫిక్‌ పోలీసులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎం ఎం బి మెడిషైన్ మల్టి స్పెషాలిటీ ఎండీ డాక్టర్ నియాజ్ ఫర్హత్. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి రామోజీ రమేష్, ప్రభుత్వ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు..
జిల్లా ప్రధాన ప్రభుత్వ హాస్పటల్లో పేషెంట్లకు, డ్యూటీలో ఉండే ట్రాఫిక్‌ పోలీసులకు ప్రతీ రోజు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తామని ఎం ఎం బి మెడిషైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ. డాక్టర్ నియాజ్ ఫర్హత్ అన్నారు. గురువారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పలు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ నియాజ్ ఫర్హాత్ , ఏసిపి రామోజీ రమేష్ ,ప్రభుత్వ హాస్పటల్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు సుమారు 500 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో రోడ్డుపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్‌ పోలీసులకు మజ్జిగ ప్యాకెట్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మెడిషైన్ హాస్పిటల్ సహకారంతో డ్యూటీలో ఉండే ట్రాఫిక్‌ పోలీసులకు ప్రతీ రోజు మజ్జిగ ప్యాకెట్‌లను వేసవి ముగిసేవరకు ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరో 15-20 రోజులు ఎండలు ఎక్కువగా ఉండనున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం ఆయన ప్రయాణికులకు,చిన్నారులకు కూడా మజ్జిగ ప్యాకెట్‌లను పంపిణీ చేశారు.


SAKSHITHA NEWS