అర్జీదారుల సమస్యలకు త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలి.
- జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లా
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
అర్జీదారుల సమస్యలకు త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘‘గ్రీవెన్స్ డే’’ లో కలెక్టర్ అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి తగు చర్య నిమిత్తం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రైతు సంఘం వైరా మండల కమిటీ సభ్యులు బాణాల శ్రీనివాసరావు, టి.నాగేశ్వరావులు వైరా మండలంలో మొక్కజొన్న సాగు అధికంగా చేయడం జరిగిందని, అకాల వర్షాల తాకిడికి పండించిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి తమను ఆదుకోవాల్సిందిగా సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు. తల్లాడ మండలం తల్లాడ గ్రామ పంచాయితీ పరిధి మల్లారం రోడ్, 3 వ వార్డు నివాసులు బాలబారతి రోడ్, కొత్తగూడెం వెళ్ళు మార్గంలో చాపల దుకాణం, చికెన్ షాపుల వ్యర్థాలను వేయడం వల్లన, దుర్వాసన, రైస్ మిల్లు నుండి డస్ట్ వెలువడడం వల్ల అనారోగ్యానికి గురికావడం జరుగుతున్నదని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపర్చగరలని, చెత్తకుండీలు ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలం సీతారాంపురం గ్రామనికి చెందిన గుంటి నాగేశ్వరరావు తనకు తాళ్ళచెర్వు రెవెన్యూ పరిధిలో సర్వేనెం.230/అ2/1లో 2 ఎకరాల 29 కుంటల వ్యవసాయ భూమి వారసత్వంగా వచ్చిన భూమిని వేరొకరి పేరున ఎక్కించడం జరిగిదని తన భూమిని తనకు ఎక్కించగలరని సమర్పించిన దరఖాస్తును విచారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా తిరుమలాయపాలెం తహశీల్దారను ఆదేశించారు. ఖమ్మం నగరం పంపింగ్‌వెల్‌రోడ్‌కు చెందిన సోపాల ధనలక్ష్మీ తన కూతురు సోపాల జననికి తలలో గడ్డ ఉండడం వల్ల కాళ్ళు చచ్చుబడి, కంటిచూపు కూడా లేక మంచానికే పరిమితం అవ్వడం జరిగినదని, ఆర్ధిక స్తోమత లేదని, తన కూతురు పేరున డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం జిల్లా రెవెన్యూ అధికారికి సూచించారు. రఘునాథపాలెం మండలంకు చెందిన పద్మశాలి, గౌడ కమ్యూనిటీలకు సర్వేనెం. 17/పి నందు 59 కుంటల భూమిని కేటాయించడం జరిగినదని, అట్టి భూమి ప్రక్కన ఉన్న చిన్న (శివ) ప్రభుత్వం కేటాయించిన భూమి తనదని అక్రమించడం జరిగినదని, అట్టి భూమిని తిరిగి మాకు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం అదనపు కలెక్టర్‌కు సూచించారు. ఖమ్మం నగరంకు చెందిన కె.రమ్యశ్రీ తాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అకౌంటెంట్ కమ్ డి.ఈ.ఓ జాబ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగినదని దానిలో భాగంగా 75 శాతం ఓ.సి ఉమెన్ కోటా క్రింద మెరిట్లో ఉండడం జరిగినదని, తనకంటే తక్కువ శాతం ఉన్న వ్యక్తిని సెలక్ట్ చేయడం జరిగినదని విచారణ చేసి తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి సూచించారు.
‘‘గ్రీవెన్స్ డే’’ లో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మదుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.