SAKSHITHA NEWS

వేలాదిగా హాజరైన బీఆర్ఎస్ శ్రేణులు…
ముఖ్య అతిథులుగా పాల్గొన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, శంభీపూర్ రాజు…
పాటలతో జోష్ నింపిన సింగర్ మధుప్రియ & బృందం…
సాక్షిత : కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధ్యక్షతన జరిగిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ ( ప్లీనరీ సమావేశం ) పండగలా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి, ఎమ్మెల్సీ డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి , ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటగా గడిచిన 9 ఏళ్లలో రూ.6 వేల కోట్లతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘ఫోటో గ్యాలరీ’ని వారు వీక్షించారు. అనంతరం గులాబీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. సభలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

12 తీర్మానాలను ప్రవేశపెట్టి బలపరిచిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీల అధ్యక్షులు, నాయకులు.

  1. వ్యవసాయం, రైతు సంక్షేమం తీర్మానాన్ని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ప్రవేశపెట్టగా.. పాక్స్ చైర్మన్ బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవి యాదవ్ బలపరిచారు.
  2. బడుగు బలహీన వర్గాల సంక్షేమం తీర్మానాన్ని కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ ప్రవేశపెట్టగా.. సీనియర్ నాయకుడు డాక్టర్ హుస్సేన్ బలపరిచారు.
  3. మిషన్ భగీరథ, మహిళ సంక్షేమం తీర్మానాన్ని నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి ప్రవేశపెట్టగా.. మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ బలపరిచారు.
     4. పల్లె – పట్టణ ప్రగతి తీర్మానాన్ని 125 డివిజన్ ప్రధాన కార్యదర్శి నవాబ్ ప్రవేశపెట్టగా.. కార్పొరేటర్ బాలాజీ నాయక్ బలపరిచారు.
     5. సామాజిక భద్రత ఆర్థిక చేయూత తీర్మానాన్ని సీనియర్ నాయకుడు కుంట సిద్ధిరాములు ప్రవేశపెట్టగా.. సీనియర్ నాయకుడు మన్నె రాజు, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ దూదిమెట్ల సోమేష్ యాదవ్ బలపరిచారు.
     6. ధరలు పెరుగుదల మోడీ వైఫల్యం తీర్మానాన్ని మాజీ కౌన్సిలర్ రంగారావు ప్రవేశపెట్టగా.. సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్, ఎత్తరి మారయ్య బలపరిచారు.
     7. తెలంగాణపై వివక్ష తీర్మానాన్ని సుభాష్ నగర్ 130 డివిజన్ అధ్యక్షుడు పోలె శ్రీకాంత్ ప్రవేశపెట్టగా.. సీనియర్ నాయకుడు సంపత్ మాధవరెడ్డి బలపరిచారు.
     8. విద్యా ఉద్యోగం తీర్మానాన్ని జగద్గిరిగుట్ట 126 డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్ ప్రవేశపెట్టగా.. మాజీ కార్పొరేటర్ కెఎం గౌరీష్ బలపరిచారు.
     9. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ప్రభుత్వ సంస్థల అమ్మకం తీర్మానాన్ని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరాం ప్రవేశపెట్టగా.. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి బలపరిచారు.
  4. బిఆర్ అంబేద్కర్ పేరు పార్లమెంట్ కు పెట్టడం తీర్మానాన్ని దుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పద్మారావు ప్రవేశపెట్టగా… మాజీ కౌన్సిలర్ కిషన్ రావు బలపరిచారు.
  5. నియోజకవర్గం అభివృద్ధి తీర్మానాన్ని సూరారం 129 డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ ప్రవేశపెట్టగా.. మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు బలపరిచారు.
     12. సోషల్ మీడియా తీర్మానాన్ని సీనియర్ నాయకురాలు అర్పిత ప్రవేశపెట్టగా.. సీనియర్ నాయకుడు అబ్దుల్ ఖాదర్ బలపరిచారు.

ఈ సందర్భంగా వేలాది సంఖ్యలో సభకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలే బీఆర్ఎస్ కు ఊపిరి అని, కార్యకర్తలు లేకపోతే పార్టీయే లేదని అన్నారు. సేవా భావం, క్రమశిక్షణ, క్రియాశీలకంగా పని చేసే 60 లక్షల సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ బీఆర్‌ఎస్సే అని అన్నారు. సీఎం కేసీఆర్ ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం దేశంలో ఏ పార్టీనేతకు లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు, తప్పుడు ఆరోపణలతో పబ్బం గడపడమే ప్రతిపక్షాల పని అన్నారు. నేడు ఏ రంగాన్ని తీసుకున్నా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందంటే అది సీఎం కేసీఆర్ గొప్పతనమేనని అన్నారు. ప్రశ్నిస్తే ఈడి, ఐటి, సీబీఐ దాడులు చేస్తూ బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలంతా బిఆర్ఎస్ వైపే ఉన్నారని.. సీఎం కేసీఆర్ వెంటే నడుస్తున్నారని అన్నారు. ఎన్నికలవేళ మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టెందుకు వచ్చే విపక్షాలకు చెంపపెట్టు సమాధానం చెప్పాలని అన్నారు. సోషల్ మీడియాలో చేసే అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టి వాస్తవాలను ముందుంచాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గడిచిన తొమ్మిదేళ్లలో 6 వేల కోట్లతో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు వివరించి.. రాబోయే రోజుల్లో మూడవసారి గులాబీ జెండా ఎగిరేలా బీఆర్ఎస్ శ్రేణులు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మేయర్, కొంపల్లి చైర్మన్, వైస్ చైర్మన్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నిజాంపేట్ కార్పొరేటర్లు, పాక్స్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, దుండిగల్ నిజాంపేట్ బీఆర్ఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్, జిహెచ్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మున్సిపాలిటీల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS