116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

SAKSHITHA NEWS

సాక్షిత : * 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అల్లాపూర్ డివిజన్ లో గల ప్రతి బస్తి లో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత కార్యకర్తలు నాయకులతో కలిసి ఫతే నగర్ లో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ ప్రతినిధుల సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ సభిహ గౌసుద్దీన్ అల్లాపూర్ డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 9 సంవత్సరాల లో నిర్మించిన ఫ్లైఓవర్లు , అండర్ పాసులూ , బస్తీలో వేసిన కొత్త రోడ్ల గురించి మరియు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలు వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, వితంతువు , ఒంటరి మహిళ పెన్షన్ , షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు , రైతు బీమా మరియు దళిత బంధువు లాంటి సంక్షేమ పథకాలు గురించి వివరించారు.

అదేవిధంగా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ తమ దృష్టికి వచ్చిన సమస్యను సకాలంలో తీరుస్తూ రోడ్లు డ్రైనేజీలు ప్రతి ఇంటికి త్రాగునీరు మరియు 24 గంటల కరెంట్ ఇస్తూ ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.అలాగే రాబోయే శాసనసభ ఎన్నికల్లో శ్రీ మాధవరం కృష్ణారావు గారిని మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను నాయకులను కోరారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page