SAKSHITHA NEWS

*సైబరాబాద్ పోలీసులు పనితీరు భేష్: డీజీపీ శ్రీ  అంజనీ కుమార్ఐపీఎస్.,*

*- సైబరాబాద్ 17 ఫంక్షనల్ వర్టికల్స్ లో టాప్*

*-నేరాల నియంత్ర‌ణ‌పోలీసు దర్యాప్తుఫంక్షనల్ వర్టికల్స్ పై తెలంగాణ రాష్ట్ర  డీజీపీ సమీక్ష సమావేశం*

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆల్ యూనిట్ ఆఫీసర్లతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ అంజనీ కుమార్, ఐపీఎస్., గారు ఏడీజిపీ సీఐడీ శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్., విమెన్ సేఫ్టీ అండ్ షి టీమ్స్ ఏడీజిపీ శ్రీమతి షిఖా గోయెల్, ఐపీఎస్., తో కలిసి ఈరోజు i.e. 24.04.2023 క్రైమ్స్ రివ్యూ అండ్ ఫంక్షనల్ వర్టికల్స్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

2020, ఆగస్టు నెల నుండి ఈ ఆన్ లైన్ క్రైమ్ రివ్యూ ప్రారంభించడం జరిగిందన్నారు.

ఇందులో భాగంగా ఫంక్షనల్ వర్టికల్స్ లో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ టాప్ లో నిలిచిందని డీజీపీ అంజనీ కుమార్ గారు., సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారిని మరియు సిబ్బందిని అభినందించారు.

సైబరాబాద్ 17 ఫంక్షనల్ వర్టికల్స్ :

1st Place:

1.      Reception Functional Vertical

2.      Station Writer

3.      Tech Team

4.      Warrants

5.      Summons

6.      Station House Officer

7.      Admin SI

8.      DI & DSI

9.      Sector SI

10. Crime Writer

11. Traffic

12. 5’S

13. Community Policing

14. Trainings

15. HRMS

16. Cyber Crime – 1

17. Cyber Crime – 2 (New)

లాంగ్ పెండెన్సీ కేసులను త్వరితగతిన పరిష్కరించడం, మహిళలు మరియు చిన్నారులకు సంబంధించిన నేరాలను తగ్గించడం, పోక్సో కేసుల పరిష్కారం, వారెంట్ల జారీ, క్రైమ్ రైటర్ ,హెచ్ఆర్ఎంఎస్ఎం,టెక్ టీమ్, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ క్రైమ్, కమ్యూనిటీ పోలిసింగ్, ట్రైనింగ్స్ వంటి వాటిల్లో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ నంబర్ -1 స్థానంలో ఉందని డీజీపీ గారు జోనల్ డీసీపీ లను, క్రైమ్స్ డీసీపీ లను, ఎస్ హెచ్ ఓ లను అభినందించారు.

ఫంక్షనల్ వర్టికల్స్ లో సైబరాబాద్ పనితీరు రాష్ట్రంలోనే ఉత్తమ స్థానానికి చేరుకునే విధంగా కృషి చేసిన ఫంక్షనల్ వర్టికల్స్ అధికారులందరినీ అభినందించారు. ఫంక్షనల్ వర్టికల్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరచిన సిబ్బందికి సీపీ గారు అభినందించి రివార్డులు అందచేశారు.

ఈ సమావేశంలో సైబరాబాద్ నుంచి సీపీ గారితో పాటు, జాయింట్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, ఐపీఎస్., ట్రాఫిక్ జాయింట్ సీపీ శ్రీ నారాయణ నాయక్, ఐపీఎస్., డిసిపి క్రైమ్స్ శ్రీ సింగెన్వర్  కల్మేశ్వర్, ఐపిఎస్., మాదాపూర్ డిసిపి శ్రీమతి శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి శ్రీ నారాయణరెడ్డి, ఐపీఎస్., రాజేంద్రనగర్ డిసిపి శ్రీ జగదీశ్వర్ రెడ్డి, బాలనగర్ డిసిపి శ్రీ శ్రీనివాసరావు, ఐపిఎస్., మేడ్చల్ డిసిపి శ్రీ సందీప్, డిసిపి అడ్మిన్ శ్రీ యోగేశ్ గౌతమ్, ఐపిఎస్., ట్రాఫిక్ డీసీపీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్., సైబర్ క్రైమ్ డిసిపి శ్రీమతి రితిరాజ్, ఐపీఎస్., డిసిపి షీ టీమ్స్ శ్రీమతి దీప్తి పంత్, ఐపీఎస్., ఏడిసిపి రాజేంద్రనగర్ శ్రీమతి రష్మి పెరుమాళ్, ఐపిఎస్., ఈఓడబల్యూ డీసీపీ శ్రీమతి కవిత, ఎస్బి ఏడీసీపీ రవి కుమార్, సిసిఆర్బి, ఏడీసీపీలు, ఏసీపీలు, సిబ్బంది మరియు వర్టికల్ సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS