SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత దినపత్రిక)
చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపిపి కొలను సునీత-వెంకటేష్ గౌడ్
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అండత్వాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, చూపు సమస్య ఉన్నవారికి అద్దాలు, ఆపరేషన్లను చేయించడం జరుగుతుందని కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుంకరి ధనమ్మ యాదగిరి గౌడ్, వైస్ ఎంపిపి మర్ల అలివెలు రాంరెడ్డి, స్థానిక సర్పంచ్ దుబ్బాక శోభా వెంకట్ రెడ్డి, మండల వైద్యాధికారి గట్టు కిరణ్ కుమార్, కంటి వెలుగు వైద్యాధికారిని ప్రియాంక, ఉప సర్పంచ్ నర్సింహ, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సన్యాసిరావు,
ఏ ఎన్ ఎం లు విజయ, నాగరాణి, పుష్ప, మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS