SAKSHITHA NEWS

ఉమ్మడి గుంటూరు జిల్లా

చేబ్రోలు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ చేబ్రోలు మండలంలో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ గ్రావెల్ మాఫియా పై పోరాటం చేయడం జరిగింది.
చేబ్రోలు మండలం వీరనాయకుని పాలెంలో దళితుల భూముల్లో జరిగిన తవ్వకాలపై కలెక్టర్ కి,మైనింగ్ అధికారులకు,విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేసినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.దానికి కారణం ఈ మాఫియాలో స్థానిక శాసనసభ్యుడు భాగస్వామి అగుటయే.
ఈ మైనింగ్ మాఫియాలో పోలీస్ శాఖ ప్రముఖ పాత్ర వహిస్తుంది. పోలీస్ శాఖ సహకారంతో రైతులు వారి పొలాల్లోకి గ్రావెల్ లారీలు వెళ్లకుండా ఏర్పాటు చేసుకున్న కంచెను కూడా పోలీసులే స్వయంగా తొలగించి లారీలను పంపిచటం జరుగుతుంది. ఎమ్మెల్యే అనుమతి ఉన్న లారీలను యథేచ్ఛగా వదులుతారు,మామూలు వారి అయితే ఫైన్స్ వేస్తారు.
ఒక ప్రజా ప్రతినిధి,పోలీసులు కలసి ఈ ప్రాంతంలో మైనింగ్ మాఫియాని జరుపుతున్నారు.
గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సబ్ కలెక్టర్ ను వేసి చర్యలు తీసుకుంటామని చెప్పి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మరలా ఈరోజు దళితుల భూములలో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది.
కిలారి వెంకట రోశయ్య అధికార యంత్రాంగం కలసి ఏ విధంగా సహజవనులను దోపిడీ చేస్తున్నారో ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. గతంలో మేము బ్రేక్ ఇన్స్పెక్టర్ తీసుకొని వచ్చి ప్రత్యక్షంగా లారీలు పట్టించి చర్యలు తీసుకోమని చెప్పినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వడ్లమూడి గ్రామంలో గల నక్కల కుంటను రాత్రికి రాత్రి తోవేస్తున్నారు. గ్రామ అవసరాల పేరుతో పర్మిషన్ తీసుకోవడం మట్టిని బయటకు అమ్మటం పరిపాటిగా మారింది.
జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు కాబట్టి త్వరలో మేము కోర్టు కూడా వెళ్లడానికి సిద్ధపడుతున్నాం.
స్థానిక ఎమ్మెల్యే అధికారులు కుమ్మక్కై మట్టి మాఫియాని నడుపుతున్నారు ఇక్కడ ఎవరు వ్యాపారం చేయడానికి వీలు లేదు ఎవరికి తోలినా మేమే తోలాలి అనే విధముగా శాసనసభ్యుడు యొక్క ప్రవర్తన ఉంది.
నారాకోడూరు బుడంపాడు మధ్యలో ఎవరైతే వెంచర్లు వేశారో వారి వద్ద కన్వర్షన్ కొరకు ఎకరాకు ఆరు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా స్థానిక శాసనసభ్యుడితో ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది.
ఈరోజు చేబ్రోలు గ్రామంలో స్వర్గీయ కరీముల్లా గారి కుమారుడు హర్షద్ ఏర్పాటుచేసి మండలంలోని ముస్లిం సోదరులను ఇఫ్తార్ విందుకు ఆహ్వానిస్తే ఆ కార్యక్రమాన్ని కూడా జరగనీయకుండా చూడాలని దురుద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా విస్మరించి ఫిష్-ఆంద్ర షాపులను అడ్డంగా పెట్టడం జరిగింది. దానిపై మేము ప్రశ్నిస్తే వాటిని పక్కకు పెట్టడం జరిగింది.
ఈ గ్రామంలో అలాగే మండలంలో ఉన్న వైసీపీ నాయకులకు నేను చెప్పేది ఒక్కటే ఈ మండలంలోకి కొత్త సంస్కృతులు తేవద్దని హెచ్చరిస్తున్నాను.
ఇలాంటి వాటిల్లో మీరు భాగస్వాములు అయి ఉంటే కనుక దాన్ని ప్రతిఫలం తప్పకుండా మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది.
రంజాన్ సందర్భంగా పదిమంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇవ్వటం అతను చేసిన తప్పా?
రెవిన్యూ అధికారులు తమకు లేని అధికారాలతో వారే కాల్వ కట్టలు ఆక్రమణ చేయాలని చూస్తే ఇంకా చట్టాలు ఎందుకు?
స్థానిక శాసనసభ్యుడు కిలారి వెంకట రోశయ్య ఏ విధంగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నాడో అలాగే తనకున్న అధికారాన్ని ఉపయోగించి లబ్ధి పొందుతున్నాడో ప్రజల ముందు ఉంచే తీరుతాం.
ప్రభుత్వ యంత్రాంగం స్పందించే వరకు మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది.
అధికారులు ఎవరైతే నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వారిపై కూడా పోరాటం చేస్తాం.

WhatsApp Image 2023 04 21 at 3.23.52 PM

SAKSHITHA NEWS