SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

గ్రామ పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్ శ్రీనివాసులు చేతి వాటం…..?

సింగరాయకొండ మండలం, సోమరాజు పల్లి గ్రామపంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న పంతగాని శ్రీనివాసులు ఆధార్ అప్డేట్స్ చేసి ప్రజల వద్ద నుండి అక్రమంగా వంద నుండి రెండు వంద రూపాయలు వరకు ప్రజల నుండి వసూలు చేస్తున్నాడని, ప్రజల జనసేన పార్టీ దృష్టికి తీసుకొని రావడం జరిగినది. ప్రజల సమస్యల పై జనసేన పార్టీ నాయకులు సోమరాజు పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వివరణ అడగటానికి వెళ్ళగా మధ్యాహ్నం 12:00 గంటలు అయినప్పటికీ కూడా అధికారులు లేకపోవడం ఈ ప్రభుత్వ పనితీరు నిదర్శనం.

కూడా నర్రావారి పాలెం గ్రామ ప్రజలకు రోడ్డు సమస్య పై అర్జీ ఇవ్వటానికి వెళ్లినప్పటికీ ఖాళీ కుర్చీలను చూసి పై అధికారులు కు ఈవో పీ ఆర్ డి, మరియు ఎంపీడీవో, డి ఎల్ పి ఓ, కీ సమస్యను తెలియజేయడం అయినది. తరువత కొంత సమయం కు గ్రామ పంచాయతీ కార్యదర్శి నల్లమల్ల సుధాకర్ రావటం జరిగినది. గ్రామ పంచాయతీలో ఆధార్ అప్డేట్స్ చేయటానికి ఏ ఏ పనికి ఎంత డబ్బులు చెలించాలి అని అడుగగా నాకు తెలియలేదు డిజిటల్ అసిస్టెంట్ గారికి తెలియాలని సమాధానం ఇవ్వటం జరిగినది. డిజిటల్ అసిస్టెంట్ పై పంచాయతీ కార్యదర్శి పై అధికారి అయినప్పటికీ కుడా ఆధార్ అప్డేట్స్ కి రేట్లు తెలియలేదు అని చెప్పటం పంచాయతీ కార్యదర్శి ప్రమేయంతోనే అవినీతి జరుగుతున్నదని ప్రజలు వారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు గ్రామ పంచాయతీలో, సచివాలయాలలో ఉచిత సేవలు అందిస్తున్నామని చెప్పి గతం లో మీ సేవ లో 30 రూపాయిలు కే అయై అప్డేట్స్ ను కూడా ఈ వైసీపీ ప్రభుత్వం సచివాలయాల పేరుతో దోచుకుంటున్నారు అని అనడానికి ఇది నిదర్శనం కధా…………..? పరివేక్షించాల్సిన పై అధికారులే అవినీతి కి సహకరిస్తున్నారనేది ప్రజలకు కలుగుతున్నటువంటి నమ్మకం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం కలగలన్న, పై అధికారులు బాధ్యత రహితంగా పని చేస్తున్నారని ప్రజలకు నమ్మకం కలగలన్న వెంటనే అవినీతి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోనీ, ఏ ఏ పనికి ఎంత ధర చెలించాలో ధరల పట్టీకను ప్రతి గ్రామ పంచాయతీ మరియు సచివాలయాలలో ఏర్పాటు చేయవలెను అని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేయటం అయినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, ఉపాధ్యక్షులు సయ్యద్ చాన్ బాషా, అధికార ప్రతినిధి సంకే నాగరాజు, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, కార్యదర్శిలు అనుమల శెట్టి కిరణ్ బాబు, కించంశెట్టి ప్రవీణ్, హరి, నున్న సతీష్, మరియు జనసైనికులు, వీర మహిళలు, పాల్గొన్నారు.

WhatsApp Image 2023 04 21 at 2.03.44 PM

SAKSHITHA NEWS