SAKSHITHA NEWS

ముగిసిన టీటీడీ పాలకమండలి
వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు


సాక్షిత తిరుమల : వేసవిలో సామాన్యభక్తుల దర్శన కల్పనే అధిక ప్రాధాన్యత, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శ‌నాలు కేటాయింపు కుదిస్తాం
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వస్తువులతో ఇకపై శ్రీవారి లడ్డూలు, భక్తులకు వితరణ చేసే అన్నప్రసాదం తయారీ చేయాలని నిర్ణయం
ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వస్తువులతో శ్రీవారికి నైవేద్యం నివేదిస్తున్న టీటీడీ
రైతు సాధికార సంస్థ ద్వారా
12 రకాల వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చేయాలని నిర్ణయం
కొనుగోలు ప్రక్రియ పై ప్రత్యేక కమిటీ నియమించిన బోర్డు
మార్కట్ గోడౌన్ పునఃనిర్మాణానికి
రూ.18 కోట్లు, కోల్డ్ స్టోరేజ్ పునఃనిర్మాణానికి రూ.14 కోట్లు
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం పునఃనిర్మాణానికి ఆధునికీకరణకు రూ. 3 కోట్లు
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62 కోట్లు మంజూరు
న్యూఢిల్లీలో ఉన్న టీటీడీ ఎస్వీ కళాశాల ఆడిటోరియం ఆధునీకరణకు 4 కోట్లు నిధులు మంజూరు
టీటీడీ విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తికి ఏపిఎస్సీ ద్వారా చేయాలని నిర్ణయం
ఢిల్లీలో శ్రీవారి ఆలయంలో మే 2వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు
శ్రీనివాససేతు నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని నిర్ణయం, ఇప్పటివరకు రూ. 287 కోట్లు నిధులు కేటాయింపు

వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్


SAKSHITHA NEWS