SAKSHITHA NEWS

అణగారిన వర్గాల గొంతుక బాబూ జగ్జీవన్ రామ్.. 116వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్, చింతల్ భగత్ సింగ్ నగర్, శివాలయ నగర్ బాబూ జగ్జీవన్‌రామ్‌ – అంబేడ్కర్ భవన్, సూరారం రాజీవ్ గృహకల్పలలో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ 116వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్ ని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, మహిళా నాయకురాలు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS