SAKSHITHA NEWS

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ నగర్ సమీపంలో నిర్మిస్తున్న నూతన ప్రభుత్వ దవఖాన నిర్మాణ పనులను పరిశీలించి, టీ హబ్ భవనాన్ని పరిశీలించి, అనంతగిరి గుట్టపై మెడికల్ కళాశాల ఏర్పాట్లును పరిశీలించారు.

మెడికల్ కళాశాల నిర్మాణ పనులు అన్ని రకాల సదుపాయాలతో… ఏర్పాట్లన్ని త్వరగా పూర్తికావాలన్నారు.

వైద్య విద్య బోధనలు ప్రారంభమయ్యే నాటికి ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు అయ్యేవిధంగా కృషి చేద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్య అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS