SAKSHITHA NEWS

సాక్షిత పేపర్ కథనానికి స్పందన


సాక్షిత ప్రతినిధి. ; అక్రమ ఇసుక టిప్పర్ ను పట్టుకున్న కల్వకుర్తి పోలీసులు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎగంపల్లి గ్రామం కు టిప్పర్ లో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని గ్రామస్తుల సమాచారం మేరకు 100 డయల్ కు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంబడే కల్వకుర్తి పోలీసులు అక్రమ ఇసుక టిప్పర్ ను పట్టుకొని కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా కల్వకుర్తి సీఐ.ఏ సైదులు మాట్లాడుతూ కొన్ని పత్రికల్లో కథనం రావడంతో ఈరోజు పక్క సమాచారం ఇవ్వడంతో అక్రమ ఇసుక టిప్పర్ ను పట్టుకోవడం జరిగిందని ఆక్రమ ఇసుక టిప్పర్ పై కేసు నమోదు చేస్తామని తెలియజేశారు.

కల్వకుర్తి పట్టణంలోనీ మాచర్ల. ఎగంపల్లి. జిల్లెల్ల గ్రామాలలో మాజీమంత్రి అనుచరున్ని అని చెప్పుకుంటూవిచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తికి చెందిన అక్రమ ఇసుక టిప్పర్ ను సాక్షిత రిపోర్టర్ 100 డయల్ చేసి కు సమాచారం ఇచ్చి కల్వకుర్తి పోలీసులకు పట్టించడం జరిగింది. ఇట్టి వ్యక్తి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాడు.* అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడు.ఇప్పటికైనా ఇట్టి విషయంలో జిల్లా కలెక్టర్. జిల్లా ఎస్పీ స్పందించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.


SAKSHITHA NEWS