SAKSHITHA NEWS

రంజాన్‌కు ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్


సాక్షిత : ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్‌కు ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. ఈ మేరకు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు మరియు మజీద్ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులతో కలిసి ఎమ్మెల్యే రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగ‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం రంజాన్‌కు ముస్లీం సోదరులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా రంజాన్‌కు అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

రంజాన్ నేపథ్యంలో నెల రోజులపాటు ఉపవాసదీక్షలు చేపడతారని, మసీదుల వద్ద రోడ్ల మరమ్మతులు, పరిసరాల పరిశుభ్రత, లైటింగ్ వంటి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. రంజాన్ ముగిసే వరకు మసీదుల వద్ద ఇబ్బందులు లేకుండా శానిటేషన్ పనులు పర్యవేక్షించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమావేశంలో ఏసీపీలు గంగారాం, రామలింగ రాజు, డిసిలు ప్రశాంతి, మంగతాయారు, ఈఈలు కృష్ణ చైతన్య, గోవర్ధన్ గౌడ్, సీఐలు పవన్, రమణ రెడ్డి, ట్రాఫిక్ సీఐలు రాజు, చంద్రశేఖర్, ఎస్సై వెంకటేశ్వర్లు, డిఈఈలు శిరీష, రూపాదేవి, పాపమ్మ, భానుచందర్, డిజీఎంలు విష్ణు ప్రసాద్, అప్పల నాయుడు, రాజేష్, సిబ్బంది మరియు మజీద్ కమిటీ సభ్యులు, మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS