SAKSHITHA NEWS

తరాలు మారినా తీరు మారని కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్
తీరు మార్చుకోని కల్వకుర్తి సూపరింటెండెంట్ శివరాం
యువజన కాంగ్రెస్ కల్వకుర్తి మండల అధ్యక్షలు బీస బాలరాజు


సాక్షిత : కల్వకుర్తి పట్టణంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కి బీస బాలరాజు ఒక పని మీద వెళ్లగా అక్కడి సిబ్బంది హాస్పిటల్ కి వచ్చే రోగులతో అసభ్య పదజాలం తో మాట్లాడుతున్న తీరుని చూసి అలాగే అక్కడే పక్కన ఉన్న గర్భిణీ స్త్రీలు స్కానింగ్ కోసం వచ్చి స్కానింగ్ తీసుకున్న తర్వాత ఒక ఐరన్ టాబ్లెట్స్ కోసం 3గంటల సేపు కూర్చున్నమని వాళ్ళు చర్చించుకుంటుంటే విని వారిని వివరాలు అడిగి తెలుసుకోని అక్కడే తన ఛాంబర్ లో ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం కి వివరించి సిబ్బంది , డాక్టర్స్ తీరు మర్చుకునెల చూడాలని శివరాం ని కోరగా రేపు హాస్పిటల్ INSPECTION ఉంది అందరూ బిజిగా ఉన్నారు.

వాళ్ళు కు చూడకుంటే మీకెందుకు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాలరాజు తెలిపారు. దీంతో బాలరాజు మాట్లాడుతూ హాస్పిటల్ నిర్వహణ చూ సుకోవల్సిన సూపరింటెండెంటే ఈ విధంగా మాట్లాడం దురదృష్ట కరమని అన్నారు. అలాగే సూపరింటెండెంట్ కు DMHO కు చుట్టరికం ఉన్నందునే నన్ను ఎవరేం చేస్తారు లే అనే నిర్లక్ష్య దోరణి తో వ్యవహరిస్తూ ఉండవచ్చు అని బాలరాజు అన్నారు. త్వరలోనే కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారులకు పిర్యాదు చేస్తామని మీడియాకు వివరించారు.


SAKSHITHA NEWS