SAKSHITHA NEWS

50 టాక్టర్లు 5 టిప్పర్లు రెండు జెసిబి లతో సుద్ధకల్ వాగులో విచ్చలవిడిగా అక్రమ ఇసుక కల్వకుర్తి టిడిపి పార్టీ బాదేపల్లి రాజు గౌడ్.అక్రమ ఇసుకను ఆపే వాడే లేరా? ఏ అధికారి కి ఫోన్ చేసిన పట్టించుకోకపోతే పట్టించుకునే అధికారి ఎవరు? కల్వకుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు బాదేపల్లి రాజు గౌడ్*నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని సుద్ధకల్ గ్రామంలోని సుద్ధకల్ వాగులో రాత్రి పది గంటలు దాటింది అంటే అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని గ్రామస్తులు తమ దృష్టికి తేవడంతో ఇట్టి విషయంపై కల్వకుర్తి టిడిపి నాయకులు బాదేపల్లి రాజుగౌడ్ మాట్లాడుతూ 50 ట్రాక్టర్లతో ఐదు టిప్పర్లతో రెండు జెసిబి లతో ప్రతిరోజు సుద్దకల్ గ్రామస్తులను నిద్రపోనివ్వకుండా విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని ఈ విషయంలో రెవెన్యూ. మైనింగ్.

పోలీస్ మొదలగు అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఇసుక మాఫియాను స్థానిక ప్రజా ప్రతినిధి. దగ్గరుండి ఇసుక మాఫియా కు సపోర్ట్ చేస్తూ అధికారులను అటువైపు రాకుండా చూస్తున్నాడని కాసులకు కక్కుర్తి పడిన అధికారులు విచ్చలవిడిగా అక్రమ ఇసుక మాఫియా జరుగుతున్న 100 కు గ్రామస్తులు ఫోన్ చేస్తే అట్టి వారిపై ఇసుక మాఫియా టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతుందని ఒక సుద్దకల్ గ్రామంలోనే 50కు పైగా ట్రాక్టర్లు అక్రమ ఇసుక నడపడం ఒక ప్రజా ప్రతినిధి వాళ్లకు అండగా ఉండడం ఇదంతా తెలిసిన ఇటు మైనింగ్ అధికారులు గానీ రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోవడంలేదని ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుందని తక్షణమే ఇట్టి విషయంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి సుద్దకల్ వాగు కు వెళ్లడానికి కటికే చిత్రాజీ సన్నాఫ్ భీమయ్య. పుట్ట వెంకటయ్య సన్నాఫ్ పుట్ట బక్కయ్య.

కాశిరెడ్డి సన్నాఫ్ నారాయణ రెడ్డి పొలాల నుండి వాగుకున్న మూడు దారులను మూసివేయాలని ఈ ఇసుక సామాన్య కి కూడా తక్కువ ధరకు అందేలా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చుకునే విధంగా ఇసుక ప్రభుత్వం కేటాయించిన ధరలకే ప్రజలకు దొరికే విధంగా చూడాలని కల్వకుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు బాదేపల్లి రాజు గౌడ్ కోరారు.


SAKSHITHA NEWS