మూడో విడత ఎన్నికల పోలింగ్ కు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి : జిల్లా కలెక్టర్
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని ఆర్డీవోలు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్లతో కలెక్టర్ వెబ్ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలక్షన్ విధులు కేటాయించిన సిబ్బంది సర్పంచ్ వార్డు సభ్యుల స్క్రూటీని, ఉప సంహరణ అనంతరం పోలింగ్ కు సక్రమమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు చూసుకోవాలని అలాగే ఫెసిలిటేషన్ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, మెటీరియల్ పంపిణీ, వాహనాలు ఏర్పాట్లు చేసుకోవాలని పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి స్టేజి 1 ఆర్ ఓ లు 37 ఏ రిజిస్టర్ లో సర్వీస్ ఓటర్ల వివరాలు నమోదు చేయాలని, స్టేజి 2 ఆర్ ఓ లు 37 సి రిజిస్టర్ లో ఎన్నికలలో విధులు నిర్వహించే వారి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు.
రిటర్నింగ్ అధికారులు సంబంధిత గ్రామ పంచాయతీ లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని మౌళిక వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలని అలాగే పోలింగ్ తరువాత ఓట్లను కౌంటింగ్ చేయుటకు తగ్గిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, డిపిఓ యాదగిరి, డి ఆర్ డి ఏ పి డి వి వి అప్పారావు, డివిజనల్ పి ఓ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
