ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: సీఐ రాజశేఖర్
….
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న సూర్యాపేట రూరల్ పరిధి గ్రామాలలో సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్ ఎన్నికల అధికారులతో కలిసి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాలను సందర్శించడం జరిగింది.
గ్రామాల్లో ప్రశాంత వాతావరణము ఎన్నికలు జరిగి గ్రామాల ప్రశాంత గ్రామాలుగా పోలీస్ రికార్డ్స్ లో ఉండాలని సిఐ తెలిపారు. ఓటర్లు ముందస్తుగా వారి యొక్క పేర్లు తాజా ఓటర్ జాబితాలో ఉన్నాయో లేవో తనిఖీ చేసుకోవాలని ఎన్నికల రోజున పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్లో నిలబడి వారి యొక్క ఓటును సక్రమ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవాలని సిఐ తెలిపారు.
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నిబంధనలు మేరకు ప్రచారం నిర్వహించుకోవాలని అన్నారు. ప్రచార సమయంలో అభ్యర్థులు ఒకరికొకరు విమర్శలు చేసుకోవద్దని అంతా ఒక ఊరి గ్రామం వారమే అని గుర్తుంచుకోవాలని అన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
