పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుంది

Sakshitha news

పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుంది – తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్.

పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలం, కాటూరు గ్రామంలో స్థానిక పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్ .

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఒక ప్రక్క రాష్ట్రానికి పరిశ్రమల ద్వారా పెట్టుబడులు తీసుకువస్తూనే, మరో ప్రక్క పేద,బడుగు,బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీలతో గెలిపించవలసిన బాధ్యత అందరిపై ఉన్నదని రాజేంద్రప్రసాద్ తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ వేమూరి శ్రీనివాసరావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శరత్ కుమార్, పార్టీ సెక్రెటరీ యుగబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ మరియు స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.