చింతల్ ఆర్యవైశ్య సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తా: కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

చింతల్ ఆర్యవైశ్య సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తా: కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్: చింతల్ ఆర్యవైశ్య సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు, నిధుల మంజూరు కోసం ప్రభుత్వంతో మాట్లాడి తన వంతు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ హామీ ఇచ్చారు.

చింతల్ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు షాపూర్ నగర్‌లోని శ్రీశైలం గౌడ్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు సంబంధించిన సమస్యలను వివరించారు. భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు, నిధుల మంజూరు కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, తక్షణమే సంబంధిత రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు, నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పార్సి ప్రకాష్ గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షులు వస శ్రీనివాస్ గుప్త, చింతల్ అధ్యక్షులు విజయ్ కుమార్ గుప్త, సంఘం సభ్యులు ప్రభు రాజు గుప్త, కృష్ణమూర్తి గుప్త, రాజు గుప్తా, వీరేందర్ గుప్త, మురళి, శ్రీనివాస్, ఆంజనేయులు, రమేష్, సత్యప్రసాద్, నారాయణ, నల్ల రాజయ్య, బద్దయ్య, సంధ్య, శ్రావణి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.