కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ షాపూర్ నగర్లోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా పలు కాలనీలకు చెందిన ప్రజలు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, మంచినీరు, అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజి నిర్మాణం లతోపాటు తదితర పనులను చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు వివరించిన కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మరికొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు..
అదేవిధంగా గాజులరామారం డివిజన్ పరిధిలోని నూతనంగా ఎన్నికైన పి.ఎం.రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండు మరియు వారి కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుస్తూ, కాలనీ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు..
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో పలు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST