అమ్మ జన్మనిస్తే..గురువు జీవితానికి అర్థాన్ని గమ్యాన్ని ఇస్తాడు

Sakshitha news

అమ్మ జన్మనిస్తే..గురువు జీవితానికి అర్థాన్ని గమ్యాన్ని ఇస్తాడు

భారతదేశానికి రెండో రాష్ట్రపతి అంతకుముందు మొదటి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన మహనీయుడు డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం శుభసందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన టీచర్స్ డే వేడుకలకు డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిదిగా హాజరై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కి నివాళులు అర్పించి, ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి గౌరవించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువేనమః గురువు లేనిదే విద్య లేదు..విద్య లేనిదే జ్ఞానం లేదు.

. జ్ఞానం లేకపోతే ఈ లోకంలో మనుగడే ఉండదు అని అన్నారు. ఉపాధ్యాయుల కృషి త్యాగం నిస్వార్ధ సేవను గుర్తించడం అనేది ఉపాధ్యాయ దినోత్సవం ప్రధాన ఉద్దేశం అని అన్నారు. ఉపాధ్యాయులైన వారు పిల్లలకు జ్ఞానాన్ని అందించడమే కాక వారి జీవితాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు సేవలను కొనియాడడానికి వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఉన్న గొప్ప రోజు ఈ టీచర్స్ డే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాథాపద్మజ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనసూయ, నాయకులు భాస్కర్ రెడ్డి, పాండుగౌడ్, మల్లేష్, ఖలీమ్, అధ్యాపక బృందం, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.