అనాథాశ్రమంలో గీతాదేవి జన్మదిన వేడుకలు…..
అనాథ చిన్నారులకు అల్పాహారం, పండ్ల పంపిణీ….*
సాక్షిత : సూర్యాపేట జిల్లా/ కోదాడ మాతృదేవోభవ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షురాలు పబ్బా గీతాదేవి జన్మదిన వేడుకలను స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ చిన్నారులకు అల్పాహారం, పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన సొసైటీ డైరెక్టర్ చల్లా లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ మానసిక వికలాంగులైన చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. వాసవీమాత ఆశీస్సులతో సమాజానికి ఆదర్శంగా నిలిచే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం సొసైటీ సభ్యులు బృందావన్ స్కూల్‌ను సందర్శించి, కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించిన చిన్నారులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాతృదేవోభవ చారిటబుల్ సొసైటీ అధ్యక్షురాలు పబ్బా గీతాదేవి, వెంకటేశ్వర్లు, కోశాధికారి ఇమ్మడి సతీష్ బాబు, డైరెక్టర్లు వెంపటి ప్రసాద్, వంకాయల స్వాతి, చల్లా లక్ష్మీనరసయ్య, వంగవీటి లోకేష్, వంగవీటి నాగరాజు, వంగవీటి రంగారావు, ఓరుగంటి నవీన్, విజయ్ కాంత్, బండారు ఆనంద్ అనాథాశ్రమం సిబ్బంది పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST