హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలని లో చేపట్టవలసిన, పెండింగ్

Sakshitha news

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలని లో చేపట్టవలసిన, పెండింగ్ లో ఉన్న సేవరేజ్ పైప్ లైన్ పనులను, అలానే చేపట్ట వలసిన పలు అభివృధి పనులను జలమండలి సిబ్బంది, జిహెచ్ఎంసి వీధి దీపాల సిబ్బంది, కాలనీ వాసులతో కలసి పరిశీలించిన తాజా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీ వారి విజ్ఞప్తి మేరకు జలమండలి అధికారులతో పర్యటించి పాత సెవెరేజ్ లైన్ను మార్చి నూతన సెవెరేజ్ పునర్నించాలని కోరగా, జలమండలి అధికారులతో కలసి చర్చించి, పరిష్కారం చూపి, పనులను వెంటనే మొదలు పెట్టాలని అధికారులకు చెప్పడం జరిగింది అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు.

ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని,  అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి సూపర్వైజర్ నరేంద్ర వారి సిబ్బంది, వీధి దీపాల ఇంచార్జి సుధాకర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top