భౌరంపేట్‌లో శ్రీ శ్రీ ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించిన శ్రీ శ్రీ శ్రీ శ్యాక్తానంద గిరి స్వామి

Sakshitha news

భౌరంపేట్‌లో శ్రీ శ్రీ ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించిన శ్రీ శ్రీ శ్రీ శ్యాక్తానంద గిరి స్వామి గారు…

ఐశ్వర్యాంబిక తపోవనం త్రిశక్తి పీఠం పూజ్య గురువులు శ్రీ శ్రీ శ్రీ శక్తానంద గిరి స్వామి వారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ భౌరంపేట్ లో మల్లన్న గుడి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, ఆలయ అభివృద్ధికి సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు. అనంతరం స్వామి వారిని గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు, భక్తులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.