శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగాన్ని దర్శించుకున్న టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేష్ రెబ్బ
శంకర్‌పల్లి సాక్షిత ; శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేష్ రెబ్బ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, అర్చకులు ప్రమోద్, డైరెక్టర్ ను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. మహిమగల లింగాన్ని దర్శించుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని డైరెక్టర్ అన్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న మరణమృదంగం సినిమా చిత్రీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. మరల సమయం చూసుకొని శివాలయానికి వస్తానని తెలియజేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
