కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల అధ్యక్షుల ఎంపికకు అభిప్రాయ సేకరణ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్, మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ , కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కోసం మంగళవారం అభిప్రాయ సేకరణ చేపట్టారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో, పీసీసీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్ష పదవిని ఆశిస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకుల వివరాలను సేకరించి, ఒక్కొక్కరి అభిప్రాయాలను కూన శ్రీశైలం గౌడ్ స్వయంగా తెలుసుకున్నారు..
నూతన అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా ఉండే నాయకులను పిసిసి ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు..
అభిప్రాయ సేకరణ ద్వారా సేకరించిన వివరాలను పీసీసీకి అందజేసి, పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలకు అధ్యక్షులను త్వరలో ప్రకటిస్తామని కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఫక్రుద్దీన్ తో పాటు కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST