అభివృద్ధి చేశాం అవకాశం ఇవ్వండి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

Sakshitha news

అభివృద్ధి చేశాం అవకాశం ఇవ్వండి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

సాక్షిత వనపర్తి
అభివృద్ధి చేశాం అవకాశం ఇవ్వాలని గణపురం మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా తన మన తారతమ్యం లేకుండా పని చేశామని ఓటు అడిగే నైతిక హక్కు బిఆర్ఎస్కే ఉందని మండల కేంద్రంలో క్యామ అజంతగెలుపు కీలకమని అన్నారు ఎన్నికలకు ముందు కెసిఆర్ కు మించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓట్ల అడిగేందుకు వచ్చేయ్ కాంగ్రెస్ నాయకులను రైతులకు భరోసా లేదని మహిళలకు 2500 ఆసరా పింఛన్లు 4000 తులం బంగారం విద్యార్థులకు స్కూటీలు ధాన్యానికి బోనస్ కేసీఆర్ కిట్టు కంటి వెలుగు బతుకమ్మ పండుగ చీరలు ఏమయ్యా అని నిలదీయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top