అశ్వారావుపేట లో మద్యం విక్రయాలలో భారీగా అవినీతి అక్రమాలు
మద్యం సిండికేట్ దందా పేరుకే ఎమ్మార్పీ కానీ క్వాటర్కు 20 రూపాయలు. ఫుల్ కు 80 రూపాయలు. అదనంగా వసూలు చేస్తున్నారు.
అశ్వారావుపేట సాక్షిత :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో మద్యం విక్రయాలలో భారీగా అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయి. మండలానికి చెందిన మద్యం వ్యాపారులంతా సిండికేట్(ఉమ్మడి వ్యాపారం) గా ఏర్పడి అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ అందిన కాడికి అడ్డగోలుగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. అధిక లాభాల కోసం మద్యం వ్యాపారస్తులు సిండికేట్ గా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారు. మద్యం అమ్మకానికి ఏ ఇంటి నెంబర్ పై లైసెన్సు పొందారో అక్కడే క్రయవిక్రయాలు జరపాలి కానీ మద్యం వ్యాపారస్తులు చట్టవిరుద్ధంగా గ్రామాలలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. అక్రమాలను అరికట్టాల్సినటువంటి ఎక్సైజ్ అధికారులు కళ్ళుండి చూడలేని కబోది పక్షులా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమను అడిగే వారు లేకపోవడంతో తమకు ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన రేట్లకు మద్యాన్ని అమ్ముతూ భారీగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఎంఆర్పి ధరకే మద్యం అమ్మాల్సి ఉన్న ఎంఆర్పి ధరకు అమ్ముతున్న దాఖలాలు లేవు. 18 సంవత్సరాలు లోపు వారికి మద్యం అమ్మకూడదని నిబంధనలు ఉన్న వయసు నిమిత్తం లేకుండా మద్యం విక్రయిస్తున్నారని సర్వత్ర ఆరోపణలు వస్తున్నాయి.
సిండికేట్ దందా మద్యం వ్యాపారస్తుల అవినీతి అక్రమాల తీరుతెన్నులను ఓసారి పరిశీలిస్తే
మండల కేంద్రం అయినటువంటి అశ్వారావుపేటలో మద్యం వ్యాపారస్తులు సిండికేట్ గా ఏర్పడి అడ్డగోలుగా తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సిండికేట్ షాపుల ద్వారా ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులకు ప్రతిరోజు మద్యం సరఫరా చేస్తున్నారు. లైసెన్స్ పొందిన చోట తప్ప ఇతర ప్రదేశాలలో మద్యం విక్రయించడం నేరం చట్ట పరిధి లోనే వ్యాపారం నిర్వహించుకోవాల్సిన వ్యాపారులు నిబంధనలను గాలికి వదిలి గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ విరివిగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల కి కొదవలేదు. గల్లీకి ఒకటి చొప్పున ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు వెలుస్తున్నాయి. మద్యం అమ్మకాలలో బెల్ట్ షాపులదే అగ్రస్థానం 80 శాతానికి పైగా మద్యం విక్రయాలు బెల్టు షాపుల ద్వారానే జరుగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు నిబంధనల ప్రకారం బాటిల్ పై ఉన్న ఎంఆర్పి ధరకే మద్యం విక్రయించాలి. కానీ వైన్ షాపుల నిర్వాహకులు ప్రతి మద్యం బాటిల్ పై బెల్ట్ షాపులకు 20 రూపాయలు అదనపు ధరకు విక్రయిస్తున్నారు. బెల్ట్ షాపుల నిర్వాహకులు మరో 20 రూపాయలు అదనంగా మందు బాబులకు విక్రయిస్తున్నారు. దీంతో రోజువారి కూలి చేసుకునే ప్రజలతో పాటు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ ఎక్సైజ్ రూల్ 25 ప్రకారం జాతీయ రహదారులతో పాటు మసీదు చర్చి హాస్పిటల్ పాఠశాలలకు బస్టాండ్ వంటి రద్దీగా ఉండే ప్రదేశాలకు 100 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండాలి. దీనివలన విద్యార్థులు ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకోని అధికార యంత్రాంగం లేకపోవడం విశేషం మద్యం అక్రమాలను నిరోధించాల్సిన ఎక్సైజ్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
