జీవో 97 రద్దు చేయాలి.. పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలి
మండల వ్యాప్తంగా కదిలి వచ్చిన పార్టీ శ్రేణులు
అశ్వారావుపేట సాక్షిత :
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మండల పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయం ముందు హైవే రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మండల వ్యాప్తంగా కదిలి వచ్చి పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జీవో 97తో పాలిటెక్నిక్ విద్యావ్యవస్థ దెబ్బతింటుందని, విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవద్దని, పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే ఈ నల్ల జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
అనంతరం స్థానిక మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భూక్యా ఉదయ జ్యోతి ఆధ్వర్యంలో అశ్వారావుపేట తహసీల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయుకులు భూక్య ప్రసాదు, జుజ్జురపు శ్రీరామ్ మూర్తి, జూపల్లి రామరణ రావు, గుడవర్తి వెంకటేశ్వరరావు, జాలిపల్లి శ్రీరామ్ మూర్తి, జక్కుల రాంబాబు, మందపాటి మోహన్ రెడ్డి, మోటూరి మోహన్, ఆరెపల్లి గోవింద్, పాలవలస జీవన్ రావు, శెట్టిపల్లి రఘురాం, తగరం జగన్నాథం, సోమని రమేష్, బాలి కిరణ్, ఉప సర్పంచ్ సంగీతం రాజు, మాజీ సర్పంచ్ సోని ప్రసాద్, శ్రీకాళహస్తి, అప్పారావు, తోట వెంకటస్వామి, గెడ్డం మంగరాజు, మనోహర్, కొనాకళ్ల గంగయ్య, పార్టీ శ్రేణులు, విద్యార్థి, యువజన నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
