SAKSHITHA NEWS

పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రికి ‘వరం’

రాజమండ్రి : ఏపీలో 2027లో జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం రూ.271.43 కోట్లు కేటాయించింది. 2071-72 ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారన్న అంచనాలతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులు చేపట్టేలా టెండర్లను పిలవగా, పుష్కరాల ప్రతిపాదనలతో వాటిని రద్దు చేసి కొత్త నిధులను కేంద్రం ఇచ్చింది…