జాతీయ సైన్స్ ఫేయిర్ కు ఎంపికైన నివేదిత విద్యార్థిని అభినందించిన ఉపాధ్యాయులు యాజమాన్యం
సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లా కొత్తకోట నివేదిత హైస్కూల్ పదవ తరగతి విద్యార్థి జి. మణికంఠ, జడ్చర్ల పోలేపల్లి సెజ్ ఎస్. వి. కె. యం. పాఠశాలలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి మణికంఠ తయారు చేసిన టైమర్ ను మొబైల్ వాడకంలో వుపయోగించడం ద్వారా గంటల తరబడి ఛార్జింగ్ పెట్టడం వలన బ్యాటరీ వెడేక్కడం, పాడైపోకుండా వుంటుందని, ఎలక్ట్రిక్ వాహనాల చార్జీంగ్ కూడా ఉపయోగించవచ్చని వివరించాడు.
ఈ సందర్భంగా వనపర్తి జిల్లా నుండి జాతీయ స్థాయికి ఎంపికైన నివేదిత హైస్కూల్ పదవ తరగతి విద్యార్థి జి. మణికంఠ మరియు సైన్స్ ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ ఆకుల లక్ష్మి, యాజమాన్య బృందం ప్రిన్సిపాల్ మరియు సహచర ఉపాధ్యాయులు అభినందించారు.