సంక్రాంతికి తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్?
హైదరాబాద్:
తెలంగాణలో సంక్రాంతి పండుగకు ముందే మందుబాబులకు చేదు వార్త ప్రకటించనుంది, బేవరేజస్ కార్పొరేషన్ కు బీర్లు సరఫరా నిలిపి వేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది. దీంతో ఆ సంస్థ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కింగ్ ఫిషర్,హెనీకిన్,బీర్ల సరఫరా ఆగిపోనుంది..
ఈ మేరకు బీర్ల కంపెనీలు ఒక ప్రకటనలో వెల్లడించా యి. కింగ్ ఫిషర్‌తోపాటు హైన్‌కెన్ బీర్ల సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తు న్నట్లు కంపెనీ ప్రకటించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ ఈ నిర్ణయానికి రెండు ప్రాథమిక కారణాలను పేర్కొంది.
2019-20 ఆర్థిక సంవత్స రం నుంచి యునైటెడ్ బ్రూవరీస్ బీర్ ప్రాథమిక ధరను సవరించలేదు. దాంతో రాష్ట్రంలో కంపెనీకి గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీసింది.
చెల్లించని బకాయిలు : టీజీబీసీఎల్ ద్వారా గత బీర్ సరఫరాలకు సంబం ధించి మీరిన చెల్లింపులు పరిష్కరించలేదు.
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బీర్ తయారీదారు అయిన హీనెకెన్ ఎన్వీ యూనిట్ యూపీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో..ఈ రెండు సమస్యల కారణం గా టీజీబీసీఎల్‌కి కింగ్ ఫిషర్ బీర్ నిరంతర సరఫరా ఆచరణీయంగా లేదు.
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)కి బీర్ సరఫరాను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయిం చాం” అని యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది.