SAKSHITHA NEWS

వంద శాతం ఫలితాలు
పదవ తరగతి విద్యార్థులు వంద శాతంఫలితాలు సాధించాలని ..,………… ఉమ్మడి జిల్లా పరీక్షల విభాగం సెక్రెటరీ కోరారు
సాక్షిత వనపర్తి
పదవ తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులు ప్రయత్నం చేయాలని జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం సెక్రటరీ సూర చంద్ర శేఖర్ అన్నారు.
స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ల పర్యవేక్షణలో భాగంగా యాపర్ల జెడ్పీ హై స్కూల్ ను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా చంద్ర శేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో పదవ తరగతి కీలకమైన ఘట్టమని,అందులో ఉత్తీర్ణత చాలా ప్రభావితం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కొద్ద్ది సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలని ఆయన ప్రోత్సహించారు.స్వచ్చందంగా పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న మైనోద్ధీన్,అనూష,సంధ్య,శివాని,గ్రామ విద్యాభిమాని స్వరాజ్యం బాబురెడ్డిని సూర చంద్ర శేఖర్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.పదవ తరగతి విద్యార్థులకు స్టడి మెటీరియల్ అందజేశారు.
ఈనాటి కార్యక్రమంలో ఎ ఎం ఒ మహానంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్,ఉపాద్యాయులు వెంకటేష్,ఈశ్వర్ రెడ్డి,ఆంజనేయులు,బాలమ్మ, కవి,వ్యాఖ్యాత బైరోజు చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS