SAKSHITHA NEWS

ఆదాబ్ హైదరాబాద్ మరియు ప్రజాపక్షం దినపత్రికల క్యాలెండర్లను ఆవిష్కరించిన ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి …

ఆదాబ్ హైదరాబాద్ మరియు ప్రజాపక్షం దినపత్రికల నూతన సంవత్సర క్యాలెండర్లను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి బాచుపల్లిలోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ…ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ..నిత్య నూతన కథనాలతో, ప్రజా సమస్యలే పరిష్కారం లక్ష్యంగా ఆదాబ్ హైదరాబాద్ మరియు ప్రజాపక్షం దినపత్రికలు పనిచేయడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో ఆదాబ్ హైదరాబాద్ మరియు ప్రజాపక్షం దిన పత్రికలు మరింత అభివృద్ధి చెందలన్నారు. ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS