నిత్యం అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసారు.. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు…
అనంతరం తెలంగాణ రాష్ట్ర ఐఖ్య ఉపాధ్యాయ ఫెడరేషన్ – మేడ్చల్ జిల్లా వారు నూతనంగా రూపొందించిన నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంకర్ నాయక్, మహేందర్ యాదవ్, భారత్ కుమార్, సుధాకర్ రెడ్డి, TSUTF జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ రెడ్డి, సెక్రటరీ ప్రేమ్ కుమార్, దుండిగల్ మండల్ వైస్ ప్రెసిడెంట్ జయేశ్వర్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు ..
అనంతరం మల్లంపట్ లోని హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనంకు వెళ్తున్న శామీర్పేట్ రంగయ్య స్వాముల బృందం ఆశీర్వాదం తీసుకున్నారు…